బృంద స్ఫూర్తి
ఉత్సవ ఏర్పాట్లకు కుద్రాక్షంతా ఒక చోటకు చేరతారు. అందరితో అభిప్రాయాలు పంచుకుంటారు. ఒకరు పదడుగుల విగ్రహాన్ని పెడదామంటే.. ఇంకొకరు అయిదడుగులు చాలంటారు. ఒకరు డీజే కావాలంటే, మరొకరు తీన్ మార్ కోరుకుంటారు. ఇలా భిన్నాభిప్రాయాలొస్తాయి. చివరకు అందరూ ఒకతాటిపైకి వస్తారు. దీనికంటే టీమ్ వర్క్ ఇంకెక్కడుంది
9 ప్రణాళిక:
కమిటీగా ఏర్పడిన తర్వాత యూత్ సభ్యులు చేసే మొదటి పని ఇదే. సరైన ప్రణాళిక లేకపోతే.. అంతా హడావుడి అవుతుంది. భక్తులూ ఇబ్బంది పడతారు. అందుకే ఏ రోజు ఏ వేడుక అనేది ప్రతిదీ ఓ మాట అనుకుంటారు. కెరియర్లోనూ ఇంతే కదా! ప్లానింగ్ అనేది అత్యంత ముఖ్యమైన దశ.
+ సమయపాలన: ఏ
పనికైనా సమయపాలన అవసరం. ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ఏది కొద్దిగా ఆలస్యమైనా ఇబ్బందే. అందుకే కుర్రాళ్లు తెల్లారే లేచి మండపాల దగ్గర పనులు చూసుకుంటుంటారు. ఓ పరీక్ష రాసేటప్పుడు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఒక ఇంటర్వ్యూకి వెళ్లేప్పుడు ఒక్క అరగంట ఆలస్యమైనా ఉద్యోగం చేజారుతుంది. అందుకే సమయపాలన యపాలన నేర్పిస్తుందీ పండుగ.
బాధ్యత :
ఏదైనా సరిగ్గా లేకపోతే మాట పడతాం
అన్న ఆలోచన మండపాన్ని నిర్వహించే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదే ఎక్కడా తప్పు జరగకుండా చూడాలనే బాధ్యతను భుజాల మీద ఉంచుతుంది. తొమ్మిది రోజులు అప్పగించిన పనులన్నీ శ్రద్ధగా చేస్తారు. ఇది రేపు జీవితంలోని బరువు బాధ్యతలు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
నాయకత్వ లక్షణాలు:
మండపం నిర్వహించడం
అంత సులువైన పని కాదు. చిన్న చిన్న ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని ఎదుర్కొని సమయానికి అన్నీ చేయాలి. యూత్ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. అందరినీ ఒక్కతాటి పైకి తేవాలి. తమ కమ్యూనికేషన్ స్కిల్స్లో పనులన్నీ సక్రమంగా జరిగేలా చూడటం యువత ఇక్కడే నేర్చుకుంటే.. భవిష్యత్తులోనూ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉపయోగించవచ్చు.
0 పని సర్దుబాటు :
కమిటీలో కుర్రాళ్లు చాలా ఉంది ఉంటాని పెందుకుంటారు. ఎవరి పని వారు చకచకా చేసేస్తారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి బ్యా ప్లాన్స్ ఉంటాయి. రేపు ఉద్యోగా నికి వెళ్లినా.. వ్యాపారం చేసినా ఈ సర్దుబాటు తెలియాలిحج
Ⓒనిర్వహణ:
రోజూ పూజకు ఏం కావాలి. పూజలో కూర్చొనే దంపతులు ఎవరు, మండప, విగ్రహ అలంకరణ, ప్రసాదాల తయారీ.. ఇలా చాలా టాస్క్ లుంటాయి. వాటన్నింటినీ ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా తొమ్మిది రోజులు చేసి. చివరిగా నిమజ్జనం రోజు వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎల్లవేళలా అంటి పెట్టుకునే ఉంటాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం.. జై బోలో గణేష్ మహరాజ్!
Things that we can learn in Ganesh festival Ganesh Utsav committee Ganesh Chanda


No comments:
Post a Comment